ఆలమట్టి ఎత్తుపై ఏపీ అభ్యంతరం.. కేంద్రం జోక్యం కోరిన డీకే శివకుమార్
- ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపును వ్యతిరేకిస్తున్న ఆంధ్రప్రదేశ్
- ఏపీ తీరుపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అసంతృప్తి
- వివాదంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
- ప్రాజెక్టు కోసం 1.33 లక్షల ఎకరాల భూసేకరణకు కర్ణాటక నిర్ణయం
ఆలమట్టి డ్యాం ఎత్తును 524 మీటర్లకు పెంచే ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ప్రాజెక్టు పనులు కొనసాగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆలమట్టి డ్యాం ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచేందుకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వొద్దని, భూసేకరణను నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని శివకుమార్ తెలిపారు. ఈ విషయంలో ఏపీ, మహారాష్ట్ర జోక్యం చేసుకోవడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు కోసం 1.33 లక్షల ఎకరాల భూమిని సేకరించాలని తమ కేబినెట్ గత ఏడాది సెప్టెంబర్‌లోనే నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు.
2010లోనే ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం తమ వాటా నీటి వినియోగాన్ని 177 టీఎంసీల నుంచి 330 టీఎంసీలకు పెంచుకునేందుకు అనుమతి ఉందని శివకుమార్ వివరించారు. భూమి ధరలు పెరుగుతున్నందున తాము భూసేకరణ ప్రక్రియను ప్రారంభించామని, ఇది తమ రాష్ట్ర పరిధిలోనే జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ.20,000 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
ఏపీ సీఎం అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడని, ఆయన ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. మార్చి 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం కర్ణాటక ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.