ఇరాన్‌పై అమెరికా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'... ఫ్యాక్ట్ షీట్ విడుదల
- ఇరాన్‌పై యుద్దం ప్రారంభించిన అమెరికా
- తొలి 72 గంటల్లో 1700కు పైగా లక్ష్యాలను ఛేదించినట్లు ప్రకటన
- ఇరాన్ ఉగ్ర పాలనను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేసిన వైట్‌హౌస్
- అమెరికా సైనిక చర్యపై వివరణ కోరిన డెమొక్రాట్లు
- ఇరాన్ క్షిపణులు, నావికాదళాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యమన్న పెంటగాన్
ఇరాన్‌పై అమెరికా భారీ సైనిక చర్యకు దిగింది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భాగంగా తొలి 72 గంటల్లోనే 1,700కు పైగా లక్ష్యాలను ఛేదించినట్లు ప్రకటించింది. బాంబర్లు, ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలతో ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై విరుచుకుపడుతోంది. ఈ యుద్ధంలో అమెరికాదే గెలుపని, ఉగ్రవాద ఇరాన్ పాలన ఓడిపోతుందని వైట్‌హౌస్ ధీమా వ్యక్తం చేసింది. ఈ మేరకు పెంటగాన్ ఒక ఫ్యాక్ట్ షీట్‌లో వెల్లడించింది
పెంటగాన్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం, ఫిబ్రవరి 28న తెల్లవారుజామున 1:15 గంటలకు ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ మొదలైంది. అమెరికా అధ్యక్షుడి ఆదేశాల మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ఈ దాడులను ప్రారంభించింది. ఇరాన్ క్షిపణులను ధ్వంసం చేయడం, వారి నౌకాదళాన్ని నిర్వీర్యం చేయడం, ఉగ్రవాద అనుబంధ సంస్థలను నిలువరించడం, ఇరాన్ అణ్వాయుధాన్ని పొందకుండా చూడటం వంటి నాలుగు లక్ష్యాలను వైట్‌హౌస్ నిర్దేశించింది. ఇరాన్ తన మొబైల్ లాంచర్లతో విచక్షణారహితంగా క్షిపణులను ప్రయోగిస్తోందని, ఆ ముప్పులను ఎలాంటి సంకోచం లేకుండా తొలగిస్తున్నామని సెంట్‌కామ్ స్పష్టం చేసింది.
ఈ ఆపరేషన్ కోసం అమెరికా భారీస్థాయిలో సైనిక సంపత్తిని మోహరించింది. బీ-1, బీ-2, B-52 బాంబర్లు, ఎఫ్-15, ఎఫ్-16, ఎఫ్-18, ఎఫ్-22, ఎఫ్-35 ఫైటర్ జెట్లతో పాటు ఏ-10 అటాక్ జెట్లను రంగంలోకి దించింది. వీటితో పాటు పేట్రియాట్, థాడ్ వంటి క్షిపణి నిరోధక వ్యవస్థలు, ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు, ఎం-142 హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్, అణుశక్తితో నడిచే విమాన వాహక నౌకలు, గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్లను కూడా ఉపయోగిస్తున్నట్లు పెంటగాన్ తెలిపింది. ఈ దాడుల్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, ఐఆర్‌జీసీ జాయింట్ హెడ్‌క్వార్టర్స్, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, ఇరాన్ నౌకాదళానికి చెందిన నౌకలు, జలాంతర్గాములు, సైనిక కమ్యూనికేషన్ వ్యవస్థలు వంటి కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ సైనిక చర్య కొనసాగుతుండగానే, అమెరికాలోని సొంత పార్టీ డెమొక్రాటిక్ సభ్యుల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఆపరేషన్‌పై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరుతూ మార్చి 2న కొందరు చట్టసభ సభ్యులు జాతీయ భద్రతా అధికారులకు లేఖ రాశారు. ఈ ఘర్షణలో ఇప్పటికే కొందరు అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ లక్ష్యాలు, చట్టపరమైన ప్రాతిపదిక, వ్యూహంపై కాంగ్రెస్‌కు, అమెరికా ప్రజలకు వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
1979 నుంచి అమెరికా, ఇరాన్ మధ్య శత్రుత్వం కొనసాగుతోంది. ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి, ప్రాంతీయ సాయుధ గ్రూపులకు మద్దతు వంటి అంశాలపై ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఈ దాడుల ప్రభావం పడితే, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు, మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.