లోకల్ రెస్టారెంట్లో 'దేహాతి చికెన్' కొంటూ ఫ్యాన్స్ కంటబడిన ధోనీ

  • రాంచీలో స్థానిక హోటల్‌లో కనిపించిన ధోని
  • దేశీ స్టైల్ 'దేహాతి చికెన్' పార్శిల్ కొనుగోలు
  • మెర్సిడెస్ బెంజ్ కారులో వచ్చిన భారత మాజీ కెప్టెన్
  • మహీ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న అభిమానులు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
భారత క్రికెట్ దిగ్గజం, ఐపీఎల్ ఐకాన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన నిరాడంబరతతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. తన సొంతూరు రాంచీలో ఓ సాధారణ రెస్టారెంట్‌కు వెళ్లి 'దేహాతి చికెన్' పార్శిల్ తీసుకెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లోబల్ స్టార్ అయి ఉండి కూడా సామాన్యుడిలా మెలగడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

రాంచీలోని రద్దీగా ఉండే ఓ రోడ్డుపై ఉన్న 'మాతా హోటల్' వద్ద ధోనీ తన మెర్సిడెస్ బెంజ్ కారును ఆపాడు. అక్కడి నుంచి 'ఫుల్ దేహాతి చికెన్' పార్శిల్ తీసుకున్నాడు. కారు ఆగగానే, ధోనీని గుర్తించిన అభిమానులు చుట్టుముట్టి ఆనందంతో కేరింతలు కొట్టారు. ఈ దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

'దేహాతి చికెన్' అనేది బీహార్-ఝార్ఖండ్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన గ్రామీణ శైలి చికెన్ కర్రీ. ప్రత్యేక మసాలాలతో దీనిని తయారు చేస్తారు. ఈ వీడియో ధోనికి స్థానిక రుచుల పట్ల ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తోంది.

ఈ వీడియో ఎక్స్ లో షేర్ అయిన తర్వాత అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. "ధోని మనలాంటి వాడే, అందుకే ఆయన అందరికీ తలా", "ఐపీఎల్ ఆడి, మిగిలిన సమయం సాధారణ జీవితం గడుపుతాడు. జీవితమంటే ఇదే" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తన మూలాలను మరవకుండా, స్వస్థలంలో సామాన్యుడిలా మెలగడం ధోనీ శైలి అని ఈ ఘటన మరోసారి నిరూపించింది.


More Telugu News