KCR: తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

KCR Extends Holi Greetings to Telangana People
  • భారతీయ సంప్రదాయంలో రంగుల పండుగకు ప్రత్యేక స్థానం ఉందన్న కేసీఆర్
  • ఈ పండుగ జీవితంలో నూతనత్వానికి సంకేతమని ట్వీట్
  • ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్ష

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంప్రదాయంలో రంగుల పండుగకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఇది మనుషుల మధ్య ప్రేమాభిమానాలను పెంపొందించే అద్భుతమైన వేదిక అని ఆయన కొనియాడారు. ఆకులు రాలే శిశిరం ముగిసి, ప్రకృతి కొత్త చిగురులు తొడిగే వసంతానికి బాటలు వేస్తూ వచ్చే ఈ పండుగ, సామాజిక జీవితంలో నూతనత్వానికి సంకేతమని కేసీఆర్ అభివర్ణించారు.


ప్రస్తుత పరిస్థితుల్లో కొంత నిరాశలో ఉన్న తెలంగాణ ప్రజల్లో ఈ హోలీ పండుగ సరికొత్త ఆశలను, విశ్వాసాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ కులమతాలకు అతీతంగా సహోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని, ఈ రంగుల వేడుక అందరి నడుమ ఆప్యాయతలను మరింతగా విరజిమ్మాలని కేసీఆర్ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రకృతిలో వచ్చే మార్పుల వలెనే ప్రజల జీవితాల్లో కూడా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆయన కోరుకున్నారు.

KCR
K Chandrashekar Rao
Telangana
Holi
Holi Festival
BRS
Indian Festivals
Telangana People
Festival Greetings

More Telugu News