నాటాంజ్ అణుక్షేత్రంపై దాడి జరిగిందన్న ఇరాన్ రాయబారి.. ఖండించిన ఐఏఈఏ
- ప్రధాన అణుక్షేత్రంపై దాడి చేశాయన్న ఐఏఈఏలోని ఇరాన్ రాయబారి
- ఈ దాడి చట్టవిరుద్ధమని ఆందోళన
- దాడి చేసినట్లు ఆధారాలు లేవన్న ఐఏఈఏ
అయితే ఇరాన్ రాయబారి ఆరోపణలను ఐఏఈఏ ఖండించింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్‌లోని ఏ అణు కేంద్రాలు దెబ్బతినలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) తెలిపింది. వైమానిక దాడుల్లో ఇరాన్‌లోని అణు కేంద్రాలు దెబ్బతిన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఐఏఈఏ అధిపతి తెలిపారు.
ఈ విషయమై ఇరాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. వారి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని, అలాగే ఇరాన్ సరిహద్దు దేశాల్లో రేడియేషన్ స్థాయిలు పెరిగిన సంకేతాలు కూడా లేవని వెల్లడించారు.
మరోవైపు, ఇరాన్‌పై సైనిక చర్యను అమెరికా-ఇజ్రాయెల్ సమర్థించుకుంటున్నాయి. ఇరాన్ అణుసామర్థ్యాన్ని అడ్డుకోవడమే తమ ప్రధాన ఉద్దేశమని చెబుతున్నాయి. సొంతంగా అణ్వాయుధాల తయారీలో ఇరాన్ తుది దశలో ఉందని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపించాయి.