హిజ్బుల్లా చీఫ్ లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నాం: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటన
- హిజ్బుల్లా చీఫ్ షేక్ నయీం ఖాసీంను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడి
- హిజ్బుల్లా నాయకుల స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు తెలిపిన రక్షణ మంత్రి
- హిజ్బుల్లాపై పోరు సుదీర్ఘకాలం కొనసాగవచ్చన్న ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్
ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తున్న లెబనాన్ హిజ్బుల్లా నాయకుల స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు కాట్జ్ తెలిపారు. హిజ్బుల్ నియంత్రణలో ఉన్న బీరుట్లో గల దక్షిణ శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ మంత్రి తెలిపారు. సీనియర్ హిజ్బుల్లా నాయకులపై దాడులు నిర్వహించామని వెల్లడించారు. హిజ్బుల్లాపై పోరు సుదీర్ఘకాలం కొనసాగవచ్చని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇయాల్ జమీర్ తెలిపారు. ఇందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.