ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా కీలక నాయకుడు మృతి
- లెబనాన్ పార్లమెంట్‌లోని హిజ్బుల్లా బ్లాక్ అధిపతిగా ఉన్న మహమ్మద్ రాద్
- ఇజ్రాయెల్ రక్షణ దళం జరిపిన వైమానిక దాడుల్లో రాద్ మృతి
- హిజ్బుల్లా నాయకులు లెబనాన్ రక్షణ కంటే ఇరాన్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శ
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హిజ్బుల్లా కీలక నేత మృతి చెందాడు. లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ దళం జరిపిన వైమానిక దాడుల్లో లెబనాన్ పార్లమెంట్‌లోని హిజ్బుల్లా బ్లాక్ అధిపతి మహమ్మద్ రాద్ మృతి చెందారు.
హిజ్బుల్లా ఉగ్రసంస్థకు చెందిన మరికొందరు ఉన్నతాధికారులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందారు. వందల సంఖ్యలో గాయపడ్డారు.
తమ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్‌కు మద్దతుగా హిజ్బుల్లా మిసైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది.
హిజ్బుల్లా నాయకులు లెబనాన్ రక్షణ కంటే ఇరాన్‌కే అధిక ప్రాధాన్యత ఇచ్చారని, అందుకు వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ రక్షణ దళం నార్తర్న్ కమాండర్ చీఫ్ రఫీ హెచ్చరించారు. హిజ్బుల్లా తమపై మొదట రాకెట్ దాడులు నిర్వహించిందని, అందుకే తాము ప్రతిదాడులు చేస్తున్నామని స్పష్టం చేశారు. మరిన్ని దాడులు నిర్వహిస్తామని, సమీపంలోని 50 గ్రామాలను ఖాళీ చేయాల్సిందిగా అక్కడి ప్రజలకు సూచించినట్లు తెలిపారు.