దుబాయ్‌లో పీవీ సింధుకు భయానక అనుభవం.. కోచ్ కు సమీపంలోనే పేలుడు!
- సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌కు వెళుతుండగా ఘటన
- తామున్న చోటుకు సమీపంలోనే పేలుడు జరిగిందని వెల్లడి
- తన కోచ్‌కు 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగిందన్న సింధు
- భయానక పరిస్థితుల్లోనూ తమ బృందం ధైర్యంగా నిలిచిందని వ్యాఖ్య
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు దుబాయ్‌లో ఓ ఊహించని, భయానక అనుభవం ఎదురైంది. ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వెళుతున్న సమయంలో దుబాయ్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని సింధు స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు.
బెంగళూరు నుంచి బర్మింగ్‌హామ్ వెళ్లే క్రమంలో ఆమె దుబాయ్‌లో ఆగారు. అయితే, ఆమె ప్రయాణిస్తున్న విమానం దుబాయ్‌లో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే అక్కడి గగనతలాన్ని మూసివేశారు. ఆ తర్వాతి కొన్ని గంటలు చాలా ఉద్రిక్తంగా గడిచాయని ఆమె తెలిపారు. గగనతలంలో విమానాలను అడ్డగిస్తున్న శబ్దాలు వినిపించాయని, తాము ఉన్న ప్రదేశానికి చాలా సమీపంలోనే ఓ పెద్ద పేలుడు సంభవించిందని ఆమె వివరించారు.
"మీ అందరితో ఒక చిన్న అప్‌డేట్ పంచుకోవాలనుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో మా గురించి ఆరా తీస్తూ, బాగోగులు విచారిస్తున్న ప్రతి ఒక్కరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
నేను పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకుంటూ నివసించే బెంగళూరు నుంచి, ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడటానికి యూకేలోని బర్మింగ్‌హామ్‌కు ప్రయాణిస్తున్నాను. మా విమానం దుబాయ్‌లో ల్యాండ్ అయిన తర్వాత, మా నియంత్రణలో లేని కొన్ని సంఘటనలు జరగడం మొదలైంది. కొద్దిసేపటికే గగనతలాన్ని పూర్తిగా మూసివేశారు.
గడిచిన కొన్ని గంటలు అత్యంత ఉద్రిక్తంగా గడిచాయి. గగనతల దాడులను అడ్డుకునే క్షిపణుల శబ్దాలు మా తలల మీదుగా వినిపించాయి. ఆ తర్వాత కొద్ది గంటలకే, మేము దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ప్రదేశానికి చాలా దగ్గరలో ఒక పెద్ద పేలుడు సంభవించింది. ఆ పేలుడు జరిగిన చోటుకు నా కోచ్ కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉన్నారు. వెంటనే ఆయన ఆ ప్రాంతం నుంచి వేగంగా బయటకు వెళ్లాల్సి వచ్చింది.
ఇంత దగ్గరగా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోవడం నిజంగా మనల్ని కుదిపేస్తుంది. ఇలాంటివి మనకు గానీ, మనకు దగ్గరైన వారికి గానీ జరుగుతాయని మనం ఎప్పుడూ ఊహించం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. ఇంత బలమైన, ఐకమత్యంగా ఉండే జట్టు నా చుట్టూ ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ భయంకరమైన పరిస్థితిలో కూడా ప్రతిఒక్కరూ ప్రశాంతంగా ఉండి, ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ నిజమైన ధైర్యాన్ని ప్రదర్శించారు" అని సింధు ఆ వీడియోలో వెల్లడించారు.