Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాం: ఇజ్రాయెల్

Israel Targets Khamenei in Attacks on Iran
  • ఇరాన్‌లోని ఇతర అగ్ర అధికారులు, సైనిక కమాండర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడి
  • ఆ దేశ నాయకత్వాన్ని నిర్మూలించే లక్ష్యంతో దాడులు జరిగాయన్న అధికారి
  • ఈ దాడుల్లో చాలావరకు విజయం సాధించామన్న అధికారులు
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని, ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్‌లను లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ అధికారి ఒకరు వెల్లడించారు. వారితో పాటు ఇరాన్‌లోని ఇతర ఉన్నత అధికారులు, అగ్రశ్రేణి సైనిక కమాండర్‌లను లక్ష్యంగా చేసుకుని ఉదయం దాడులు జరిపినట్లు తెలిపారు.

ఇరాన్‌పై ఇప్పటి వరకు జరిగిన దాడులు ఆ దేశ నాయకత్వాన్ని నిర్మూలించే లక్ష్యంతోనే జరిగాయని, ఇందులో చాలా వరకు విజయం సాధించామని ఇజ్రాయెల్ అధికారులను ఉటంకిస్తూ ఆ దేశ ఛానల్ 12 తెలిపింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలువురు సీనియర్ కమాండర్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. పాలనా విభాగంలోని అత్యున్నత అధికారులు కూడా చనిపోయారని సమాచారం. మృతుల సంఖ్య తెలియాల్సి ఉంది.

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. తాము ఎన్ని హెచ్చరికలు చేసినా ఇరాన్ తన అణుకేంద్రాలను పునర్నిర్మించడానికి, క్షిపణులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగి ఉండకుండా వాటిని పూర్తిగా నాశనం చేస్తున్నామని తెలిపారు.
Khamenei
Iran
Israel
Masoud Shejishkian
Donald Trump
Iran supreme leader
Israel attacks Iran

More Telugu News