లాభాల్లో ఉన్నా లేఆఫ్స్.. ఏఐ వల్లే 4,000 మందిని తీసేస్తున్నాం: జాక్ డోర్సీ
- ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ కంపెనీ బ్లాక్‌లో భారీ లేఆఫ్స్
- దాదాపు సగం మంది సిబ్బందిపై వేటు
- ఏఐ టూల్స్ వినియోగం పెరగడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
- కంపెనీ లాభాల్లోనే ఉన్నా భవిష్యత్తు దృష్ట్యా ఈ చర్య తప్పలేదన్న డోర్సీ
- ఉద్యోగులకు 20 వారాల జీతం.. ఇతర ప్రయోజనాలతో భారీ ప్యాకేజీ ప్రకటన
టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టిస్తున్న ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ నేతృత్వంలోని ఫిన్‌టెక్ కంపెనీ 'బ్లాక్' సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఐ టూల్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తమ కంపెనీలోని 4,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది కంపెనీ మొత్తం సిబ్బందిలో దాదాపు సగం కావడం గమనార్హం.
ఈ భారీ తొలగింపులపై జాక్ డోర్సీ స్వయంగా స్పందించారు. ఇది తమ కంపెనీ చరిత్రలోనే అత్యంత కఠినమైన నిర్ణయాల్లో ఒకటని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పేర్కొన్నారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్.. ఒక కంపెనీని నడపడం అనే తీరునే మార్చేశాయి. తక్కువ మంది సిబ్బందితో కూడిన బృందం ఈ టూల్స్‌ను ఉపయోగించి మరింత వేగంగా, మెరుగ్గా పనిచేయగలదు. ఈ మార్పును మేం ఇప్పటికే మా కంపెనీలో గమనిస్తున్నాం" అని ఆయన తన ప్రకటనలో వివరించారు.
అయితే, కంపెనీ ఆర్థికంగా కష్టాల్లో వుండి, ఈ నిర్ణయం తీసుకోలేదని డోర్సీ స్పష్టం చేశారు. "మా వ్యాపారం బలంగా ఉంది. స్థూల లాభం నిరంతరం పెరుగుతోంది, కస్టమర్ల సంఖ్య కూడా అధికమవుతోంది, లాభదాయకత మెరుగుపడుతోంది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. మేం ఉపయోగిస్తున్న ఇంటెలిజెన్స్ టూల్స్, చిన్న బృందాలతో కలిసి కొత్త పని విధానాన్ని సృష్టిస్తున్నాయి. ఇది చాలా వేగంగా విస్తరిస్తోంది" అని ఆయన తెలిపారు.
విడతలవారీగా ఉద్యోగులను తొలగిస్తే, అది సిబ్బంది నైతిక స్థైర్యాన్ని, పనితీరును దెబ్బతీస్తుందని డోర్సీ అన్నారు. వాటాదారులు, కస్టమర్లలో కంపెనీ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లుతుందని, అందుకే ఒకేసారి స్పష్టమైన, కఠినమైన చర్య తీసుకున్నామని వివరించారు. ఉద్యోగం కోల్పోయిన వారికి భారీ ప్యాకేజీని ప్రకటించారు. వారికి 20 వారాల వేతనంతో పాటు కంపెనీలో పనిచేసిన ప్రతీ ఏడాదికి ఒక వారం చొప్పున అదనపు వేతనం చెల్లించనున్నారు. దీంతో పాటు ఆరు నెలల ఆరోగ్య బీమా, వారు వాడుతున్న కంపెనీ డివైజ్‌లు, కొత్త ఉద్యోగంలో చేరేందుకు అవసరమైన ఖర్చుల కోసం 5,000 డాలర్ల ఆర్థిక సాయం కూడా అందించనున్నట్లు తెలిపారు.
2009లో 'స్క్వేర్' పేరుతో ప్రారంభమైన ఈ కంపెనీ, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై దృష్టి సారిస్తూ 2021లో 'బ్లాక్'గా పేరు మార్చుకుంది. ఈ పునర్‌వ్యవస్థీకరణ కోసం కంపెనీ సుమారు 450 మిలియన్ల నుంచి 500 మిలియన్ల డాలర్ల వరకు ఖర్చు చేయనుంది. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ సర్దుబాటు చేసిన లాభం ఒక్కో షేరుకు 65 సెంట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయానికి ఇది 47 సెంట్లుగా ఉంది.