టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత

  • క్యాన్సర్‌తో బాధపడుతున్న రింకూ తండ్రి ఖంచంద్ర సింగ్ మృతి
  • గ్రేటర్ నోయిడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • ఇటీవల తండ్రిని చూసేందుకు జట్టును వీడి వెళ్లిన రింకు సింగ్‌
టీమిండియా యువ క్రికెటర్ రింకు సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఖంచంద్ర సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఖంచంద్ర సింగ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో ఉన్న రింకు సింగ్, ఇటీవల తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో జట్టును వీడి వెళ్లాడు. జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు తండ్రిని పరామర్శించి, మ్యాచ్ జరిగే రోజు ఉదయం తిరిగి జట్టుతో కలిశాడు. అయితే, ఆ మ్యాచ్ తుది జట్టులో రింకుకు చోటు దక్కలేదు. ఆయన స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం కల్పించారు. తండ్రి మరణవార్త తెలియడంతో రింకు సింగ్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు.


More Telugu News