Delhi Crime: రక్తపు మడుగులో భార్యాపిల్లలు.. పరారీలో భర్త.. ఢిల్లీలో ఘోరం

Delhi Shocker Husband Absconding After Wife Children Found Dead
  • ముగ్గురు పిల్లలతో సహా మహిళ దారుణ హత్య
  • కుటుంబ కలహాలతో భర్తే వారి గొంతు కోసినట్లు అనుమానం
  • పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల వేట
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళతో పాటు మూడు, నాలుగు, ఐదేళ్ల వయసున్న ముగ్గురు పసిపిల్లలు దారుణ హత్యకు గురయ్యారు. ఆ మహిళ భర్త పరారయ్యాడు. ఈ విషాదకర సంఘటన చందన్ పార్క్ ఏరియాలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 

చందన్ పార్క్ ఏరియాలో ముంచన్ కెవాత్ తన భార్య, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. ఆజాద్‌పూర్ మండిలో కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం స్థానికులు వారి ఇంటికి వెళ్లి చూసేసరికి.. ముంచన్ భార్య, ముగ్గురు చిన్నారులు రక్తపు మడుగులో విగతజీవులై పడి ఉండటం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

హంతకుడు పదునైన ఆయుధంతో వారి గొంతు కోసి చంపేసినట్లు గుర్తించారు. బాధితులు నిద్రలో ఉండగానే ఈ దాడి జరిగిందని, వారు ప్రతిఘటించే అవకాశం లేకుండా నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటన జరిగినప్పటి నుంచి ముంచన్ పరారీలో ఉన్నాడు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో, కుటుంబ కలహాల కారణంగానే అతడు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించిన అధికారులు, ప్రత్యేక బృందాలతో హంతకుడి కోసం వేట ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను సేకరించి నిందితుడు ఏ వైపు వెళ్ళాడో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
Delhi Crime
Family Murder
Chandan Park
Triple Murder
Munchn Kevaat
Crime News Delhi
Azadpur Mandi
Husband Absconding
Delhi Police
Crime Investigation

More Telugu News