దళితుల్ని గుళ్లోకి రాకుండా అడ్డుకున్న వ్యక్తి.. వీడియో ఇదిగో!

24-02-2026 Tue 12:31 | National
Advertisement
  • కర్ణాటకలో నవ దంపతులకు గుడిలో ఘోర అవమానం
  • దళితులు గుడిలోకి రావొద్దంటూ అడ్డుకున్న వ్యక్తి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన నవదంపతులు
  • గ్రామంలో శాంతికమిటీ సమావేశం నిర్వహించిన డీఎస్పీ
Advertisement
దేశం డిజిటల్ యుగంలో దూసుకుపోతున్నా, కొన్ని గ్రామాల్లో కుల వివక్ష ఇంకా వేళ్లూనుకునే ఉంది. కర్ణాటకలోని తుమకూరు జిల్లా తురువేకెరె తాలూకాలోని గోణి గ్రామంలో ఒక దళిత నవ దంపతులకు ఎదురైన అనుభవం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

అసలేం జరిగిందంటే..

కొత్తగా పెళ్లయిన జగదీష్, పంకజ జంటగా దైవ దర్శనం కోసం గ్రామంలోని అరసమ్మ ఆలయానికి వెళ్లారు. వారు గుడిలోకి ప్రవేశించగానే అక్కడున్న నారాయణప్ప అనే వ్యక్తి ఒక్కసారిగా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తనను దేవుడు ఆవహించినట్టు (శివం పూనడం) నటిస్తూ, దళిత కుటుంబం గుడిలోకి రావడానికి వీల్లేదని అడ్డుకున్నాడు. నారాయణప్ప మోకాళ్లపై కూర్చుని గర్భాలయానికి వెళ్లే దారిని అడ్డుకోవడమే కాకుండా.. ‘‘దళితులకు ఇక్కడ ప్రవేశం లేదు, మీరు బయటకు వెళ్లండి.. కావాలంటే ఇంట్లోనే పూజలు చేసుకోండి’’ అంటూ భార్యాభర్తలపై గట్టిగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న మరికొందరు గ్రామస్థులు కూడా దంపతులకు మద్దతుగా నిలవకపోవడం గమనార్హం.

పోలీసులకు ఫిర్యాదు..

జగదీష్ వెంటనే తురువేకెరె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితుడు నారాయణప్పను అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నారాయణప్పతో పాటు ప్రభ, కాంతన్న, అమూల్య, పుట్టెగౌడ, పద్మ అనే వ్యక్తులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. తహసీల్దార్ మరియు డిఎస్పీ ఆధ్వర్యంలో గ్రామంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించి, అంటరానితనం నేరమని గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

Advertisement
Karnataka templeDalit coupleTumakuru districtCaste discrimination IndiaArasamma templeTuruvekereuntouchabilitySC ST ActGoni village

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more