క్షుద్రశక్తులు నిద్రలేస్తే .. ఓటీటీలో డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్!
- నవీన్ చంద్ర నుంచి 'హనీ'
- ఈ నెల 6న థియేటర్లకు వచ్చిన సినిమా
- క్షుద్ర శక్తుల నేపథ్యంలో నడిచే కథ
- సన్ నెక్స్ట్ చేతికి ఓటీటీ హక్కులు
- 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్
థ్రిల్లర్ జోనర్ నుంచి వచ్చిన సినిమాలకు .. సిరీస్ లకు ఓటీటీలో ఒక రేంజ్ లో క్రేజ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరే 'హనీ'. నవీన్ చంద్ర ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 6వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.
పోస్టర్స్ తోనే ఆసక్తిని రేకెత్తించిన సినిమా ఇది. ఈ సినిమా ఓటీటీ హక్కులను 'సన్ నెక్స్ట్' వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన వదిలారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దివ్య పిళ్లై .. రాజా రవీంద్ర .. జయన్ని కీలకమైన పాత్రలను పోషించారు. రవి - ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, అజయ్ అరసాడ సంగీతాన్ని సమకూర్చాడు.
కథ విషయానికి వస్తే .. ఆనంద్ కి మొదటి నుంచి కూడా క్షుద్ర శక్తులపై నమ్మకం ఎక్కువ. క్షుద్ర శక్తుల అనుగ్రహంతో అనుకున్నవి సాధించవచ్చనే నమ్మకం అతనిలో బలంగా ఉంటుంది. ఈ విషయంలో భార్య .. కూతురు ఎంతగా వ్యతిరేకించినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఊరికి దూరంగా .. క్షుద్ర పూజలకు అనుకూలంగా ఉండే ఒక బంగ్లాకు భార్య పిల్లలతో కలిసి షిఫ్ట్ అవుతాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది?అనేది కథ.