తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

Telangana Assembly Budget Session Dates Fixed
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. 

సమావేశాల తొలిరోజైన మార్చి 16న  ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగిస్తారు. అనంతరం మార్చి 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుపుతారు. మార్చి 20వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana Budget
Telangana Assembly
Telangana Politics
Mallu Bhatti Vikramarka
Telangana Government
Budget Session 2024
Jishnu Dev Varma

More Telugu News