Devji: ఆపరేషన్ కగార్‌లో కీలక పరిణామం... మావోయిస్టు కీలక నేతలు లొంగుబాటు

Devji Malla Reddy Maoist Leaders Surrender in Operation Kagar
  • లొంగిపోయిన మావోయిస్టు నాయకులు దేవ్ జీ, మల్లారెడ్డి
  • తెలంగాణ ఎస్ఐబీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
  • వీరితో పాటు 16 మంది లొంగుబాటు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ కగార్'లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. మావోయిస్టు కీలక నేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి భద్రతా బలగాలకు సరెండర్ అయ్యారు. దేవ్ జీ మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండగా, రాజిరెడ్డి పొలిట్ బ్యూరో మెంబర్‌గా ఉన్నారు. రెండు రోజుల్లో వారిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

వీరితో పాటు మరో 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌జీ అలియాస్ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాకు చెందినవాడు. వీరంతా తెలంగాణ ఎస్ఐబీ ఎదుట సరెండర్ అయ్యారు. నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత సెక్రటరీగా దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మావోయిస్టు పార్టీకి సారథ్యం వహిస్తున్నారు.
Devji
Devji surrender
Malla Reddy
Operation Kagar
Maoist leaders surrender
Telangana SIB
Nambala Keshav Rao

More Telugu News