‘కాక్ టెయిల్ 2’లో రష్మిక పాత్రపై వైరల్ న్యూస్
- లెస్బియన్ జంటగా కృతి సనన్, రష్మిక!
- ట్రయాంగిల్ లవ్ స్టోరీగా కాక్ టెయిల్ 2
- జనవరి 31న షూటింగ్ పూర్తి.. త్వరలో రిలీజ్
వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న, ఇప్పుడు మరో ప్రయోగాత్మక పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీగా భావిస్తున్న ‘కాక్‌టెయిల్ 2’లో ఆమె పోషిస్తున్న పాత్ర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో రానున్న ఈ చిత్రంలో కృతి సనన్, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు.
బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో వీరిద్దరూ స్వలింగ ప్రేమికులుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రాకపోయినప్పటికీ వీరి పాత్రల గురించి ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఇదొక విభిన్నమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని, రష్మిక-కృతి పాత్రల మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
షూటింగ్ పూర్తి.. త్వరలోనే రిలీజ్
హోమీ అదజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జనవరి 31వ తేదీతో పూర్తయింది. 2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె నటించిన సూపర్ హిట్ 'కాక్‌టెయిల్' చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది. ఈ సినిమాలో షాహిద్ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపిస్తారని దర్శకుడు వెల్లడించారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని చెప్పారు. విభిన్న పాత్రలతో తన మల్టీటాలెంట్‌ను నిరూపించుకుంటున్న రష్మికకు, ఈ 'కాక్‌టెయిల్ 2' బాలీవుడ్‌లో మరో పెద్ద బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.