Dharampuri Arvind: 20 ఏళ్లుగా పార్టీని పీడిస్తున్న కోవర్టులంతా వెళ్లిపోండి: ధర్మపురి అర్వింద్

Dharampuri Arvind Calls for Covert Agents to Leave BJP
  • నిజామాబాద్ కార్పొరేషన్ ను కోల్పోయిన బీజేపీ
  • 28 స్థానాల్లో గెలిచినా దక్కని అధికారం
  • ఎంఐఎం, బీఆర్ఎస్ అండతో మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం

బీజేపీలో ఉంటూ 20 ఏళ్లుగా పార్టీని పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బాగా బలపడిందని, దక్షిణ తెలంగాణలో మరింత బలోపేతం కావాల్సి ఉందని అన్నారు.


బీజేపీ భూస్థాపితం అవుతుందన్న కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అర్వింద్ కొట్టిపారేశారు. “ఎవరి వల్ల ఎవరు భూస్థాపితం అయ్యారో మీకు తెలియదా?” అని కవితను ప్రశ్నించారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని, కేసులు ఉన్నందువల్లే అండగా నిలిచిందని ఆరోపించారు.


ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో నిజామాబాద్‌లో బీజేపీ ఓటమి పాలైంది. ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలిచి, ఎంఐఎం (14 డివిజన్లు), ఇద్దరు ఎక్స్‌అఫీషియో సభ్యులు, మరో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతుతో సంఖ్యా బలాన్ని 34కి చేర్చుకుంది. బీజేపీ 28 స్థానాల్లో విజయం సాధించినా మేయర్ పీఠం దక్కలేదు.

Dharampuri Arvind
BJP
Nizamabad
Telangana BJP
Covert Agents
Kalvakuntla Kavitha
BRS
Congress
MIM
Corporation Elections

More Telugu News