Maoists: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టలో ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి

Two Maoists Killed in Encounter at Telangana Chhattisgarh Border
  • మావోయిస్టు అగ్రనాయకుల కోసం కర్రెగుట్టల్లో భద్రతా దళాల గాలింపు
  • సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్
  • భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు
సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో కూంబింగ్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ, జూనియర్ క్యాడర్‌కు చెందిన బెటాలియన్ ఇన్‌ఛార్జ్ కేసా సోధీ ఈ ప్రాంతంలో ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు.

సుమారు రెండు వేల మంది జవాన్లు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా జల్లెడ పడుతుండగా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులు జరపగా, పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ, సీఏఎఫ్ సంయుక్త బలగాలు గత ఏడాది ఏప్రిల్ నెలలో 21 రోజుల పాటు కర్రెగుట్టలో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే అప్పుడు మావోయిస్టు పార్టీ సీనియర్ క్యాడర్ తప్పించుకుంది. వారి కోసం భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి.
Maoists
Telangana
Chhattisgarh
Sukma
Naxalites
CRPF
Amit Shah
Anti Naxal Operation
Devji Maoist

More Telugu News