డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక ట్విస్ట్.. హత్యలో ఎమ్మెల్సీ అనంత బాబు భార్య పాత్ర

  • 2022 మే 19న సుబ్రహ్మణ్యం హత్య
  • ప్రస్తుతం బెయిల్ పై ఉన్న అనంతబాబు
  • హత్యలో అనంతబాబు భార్య ప్రమేయం ఉందన్న సిట్
  • చార్జ్ షీట్ లో ఆమెను ఏ-2గా పేర్కొన్న వైనం
  • ప్రస్తుతం పరారీలో ఉన్న లక్ష్మీ దుర్గ

2022 మే 19న జరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. తాజాగా, హత్యలో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ ప్రమేయం కూడా ఉన్నట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. హత్యలో ఆమె పాల్గొన్నారని, ఆధారాలను ధ్వంసం చేశారని సిట్ బృందం రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు అడిషనల్ చార్జ్‌ షీట్ దాఖలు చేసింది. చార్జ్‌ షీట్ లో ఆమెను ఏ-2గా పేర్కొన్నారు.


కేసు నేపథ్యం సంక్షిప్తంగా:

  • సుబ్రహ్మణ్యం హత్య తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అనంత బాబు అప్పగించారు.
  • గత ఏడాది సుబ్రహ్మణ్యం కుటుంబం విజ్ఞప్తి మేరకు జులైలో సిట్ ఏర్పాటు అయింది.
  • సిట్ సేకరించిన ఆధారాలు: సీసీ ఫుటేజ్, కాల్ రికార్డులు, సాంకేతిక ఆధారాలు.
  • ప్రస్తుతం అనంత బాబు బెయిల్‌పై ఉన్నారు.
  • లక్ష్మీ దుర్గ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు సిట్ అధికారులు తెలిపారు.
  • ఈ కేసులో అనంత బాబు గన్‌మెన్లు, అనుచరులను సిట్ బృందం ఇప్పటికే విచారించింది.


More Telugu News