స్వదేశంలో ట్రంప్ పట్ల తీవ్ర వ్యతిరేకత.. తాజా సర్వే వెల్లడి

International
Advertisement
  • ఏడాది తిరిగేసరికే పాతాళానికి పడిపోయిన ప్రజాదరణ
  • వలస వ్యతిరేక విధానాలపై ప్రజల్లో ఆగ్రహం
  • ప్రతీకార సుంకాలపై స్వదేశంలోనూ తీవ్ర విమర్శలు
Advertisement
అమెరికా 48వ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే ఆయన రేటింగ్ అత్యంత దారుణంగా పడిపోయింది. తాజాగా యాహూ/యుగోవ్ నిర్వహించిన సర్వేలో 40 శాతం మంది అమెరికన్లు ట్రంప్‌ను ‘అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు’గా పేర్కొన్నారు. గతంలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన ఎవరికీ ఈ స్థాయిలో వ్యతిరేకత ఎదురుకాలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

సర్వేలోని ముఖ్యాంశాలు..
కేవలం 12 శాతం మంది మాత్రమే ట్రంప్‌ను ‘అద్భుతమైన అధ్యక్షుడు’ గా భావిస్తుండగా.. 53% మంది ఆయనను ‘విఫల అధ్యక్షుడు’ గా ముద్ర వేశారు. ట్రంప్ ఆమోదం రేటింగ్ 39 శాతానికి పడిపోగా.. వ్యతిరేకత 58 శాతానికి పెరిగింది. ముఖ్యంగా వలస వ్యతిరేక విధానాలు, హెచ్-1బీ వీసా నిబంధనల కఠినత, మరియు వాణిజ్య యుద్ధం వంటి నిర్ణయాలపై అమెరికన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వరుస వివాదాలు..
గతేడాది ‘లిబరేషన్ డే’ పేరుతో వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు వికటించాయి. స్వదేశంలోనూ దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే ప్రతిపక్ష డెమొక్రాట్ల నియంత్రణలో ఉన్న నగరాల్లో ‘నేషనల్ గార్డ్‌’ ను మోహరించడం వంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతను మరింత పెంచాయి.

మధ్యంతర ఎన్నికలపై ప్రభావం..
ప్రజాదరణ పడిపోతుండటంతో 2026లో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఓటమి తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సెనేట్ డెమొక్రాట్ల వశమైతే తనపై అభిశంసన వేటు పడే అవకాశం ఉందని ట్రంప్ స్వయంగా తన మద్దతుదారులను హెచ్చరించడం అక్కడి రాజకీయ వేడిని సూచిస్తోంది.

ట్రంప్ యంత్రాంగం దిద్దుబాటు చర్యలు..
ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని గమనించిన ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు వ్యూహాలు మారుస్తోంది. మిన్నెసోటాలో వలసదారులపై అణిచివేతను ఆపడం, ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను తగ్గించడం వంటి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అయితే, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఈ చర్యలు ఓటర్ల మనసు మార్చలేవని తాజా పోల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
Advertisement

సంబంధిత వార్తలు

Donald TrumpTrump ratingUS PresidentAmerica electionsH-1B visaUS politicsTrade warRepublican PartyJoe BidenTrump administration

More Telugu News

‘ఆర్ఆర్‌ ట్యాక్స్‌’ నిజమే అయితే చర్యలేవి? మోదీ, షాలకు కేటీఆర్‌ ప్రశ్న

05 Nov, 13:37

రావణుడిగా యశ్ విశ్వరూపం.. అద్భుత నటనతో కట్టిపడేసిన రాకింగ్ స్టార్.. రామాయణలో యాక్టింగ్‌కు ప్రేక్ష‌కులు ఫిదా!

05 Nov, 13:20

అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘జైలర్‌ 2’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

05 Nov, 13:09

రూ.1020 కోట్ల కొకైన్ స్మగ్లింగ్ యత్నం.. టీ కోసం లారీ డ్రైవర్ ఆగడంతో బ‌య‌ట‌ప‌డ్డ‌ కుట్ర!

05 Nov, 13:01

గొడవలతో నష్టపోయేది కార్యకర్తలే.. మేం బాగానే వుంటాం: జేసీ ప్రభాకర్‌రెడ్డి

05 Nov, 12:58

రాత్రి, ఉదయం వేళల్లో గాలిలో కాలుష్యం ఎందుకు పెరుగుతుంది?

05 Nov, 12:56

'రామాయణం - పార్టు 1' (మూవీ రివ్యూ)

05 Nov, 12:53

సెంచరీలు కాదు.. 43 పరుగుల ఇన్నింగ్సే బెస్ట్‌.. కోహ్లీ ఎంపిక వెనుక ఆసక్తికర కారణం

05 Nov, 12:40

ఓటేసిన పరిటాల కుటుంబం.. వైసీపీపై సునీత విమర్శలు

05 Nov, 12:37

ఏపీ పరిషత్ ఎన్నికల్లో ఓటు వేసిన బోయపాటి శ్రీను

05 Nov, 12:24

ఒంటిపై పాములు, త్రిశూలాలు.. యశ్‌ 'రావణ' పాత్ర ఆభరణాల ప్రత్యేకతలివే!

05 Nov, 12:23

ఒబామా తర్వాత డెమోక్రాట్ల ఆశాకిరణం.. 2028 అధ్యక్ష రేసులో జాన్ ఒసాఫ్‌ పేరు!

05 Nov, 12:21

హత్య కేసు నిందితుడికి బెయిల్.. బైక్ ర్యాలీతో హీరోలా స్వాగతం!

05 Nov, 12:17

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్.. శబరిని ఎందుకు వదిలేశారంటూ వైసీపీ ప్రశ్న

05 Nov, 12:01

చాహల్‌పై ఆర్‌జే మహ్వష్ ఆరోపణలు చేశారా?.. వైరల్ క్లిప్‌లోని అసలు నిజమిదే!

05 Nov, 11:58
..More Telugu News