Hamer Missiles: భారత్ మరో కీలక అడుగు.. దేశీయంగా హామర్ క్షిపణులు ఉత్పత్తి

Hamer Missiles to be produced in India
  • ఇప్పటికే రష్యా సహకారంతో బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేస్తున్న ఇండియా
  • తాజాగా ఫ్రాన్స్ సహకారంతో హామర్ క్షిపణులను తయారు చేయనున్న భారత్
  • ఆపరేషన్ సిందూర్ సమయంలో హామర్ క్షిపణులను వాడిన ఇండియా

మేకిన్ ఇండియాలో భాగంగా ఇప్పటికే భారత్ పలు ఆయుధాలను సొంతంగా తయారు చేస్తోంది. రష్యా సమన్వయంతో శత్రు భయంకర బ్రహ్మోస్ క్షిపణులను ఇండియా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణుల దెబ్బకు పాకిస్థాన్ బెంబేలెత్తిపోయింది. తాజాగా భారతో మరో ముందడుకు వేసింది. ఫ్రాన్స్ సహకారంతో భారత్ దేశీయంగా హ్యామర్ క్షిపణులను తయారు చేయనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రధాని మోదీ మధ్య దీనిపై ఒప్పందం కుదిరింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఈ క్షిపణులను కూడా వాడింది.


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద ఉన్న రఫేల్ యుద్ధ విమానాలకు హామర్ క్షిపణులను జోడించారు. తాజాగా మరో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత రక్షణ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. వీటికోసం అదనంగా హామర్ క్షిపణులు తయారు చేయాల్సి ఉంటుంది. స్వదేశీ తేజస్ యుద్ధ విమానాలకు కూడా ఈ క్షిపణులను జోడించనున్నారు. ఈ క్షిపణులను ఇండియాలోనే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్ సంయుక్తంగా తయారు చేయనున్నాయి.


మేకిన్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా హెచ్125 హెలికాప్టర్లను కూడా స్వదేశీయంగా తయారు చేయనున్నారు. కర్నాటకలోని వేమగాల్‌లో అసెంబ్లింగ్ యూనిట్ ప్రారంభమైంది. వీటిని యూరోపియన్ సంస్థ ఎయిర్‌బస్, భారత్‌కు చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. ఇది లైట్ మల్టీరోల్ హెలికాప్టర్. మంచు పర్వతాల్లోనూ సత్తా చాటుతుంది. హిమాలయాల్లోని ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు వరకు ఇది ఎగరగలదు.

Hamer Missiles
Make in India
Indian Air Force
Rafael fighter jets
BEL
Bharat Electronics Limited
Safran
HAL Tejas
defense
India

More Telugu News