Nandamuri Tarakaratna: నందమూరి తారకరత్నను స్మరించుకున్న విజయసాయిరెడ్డి
టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న మూడో వర్ధంతి సందర్భంగా పలువురు ఆయనను స్మరించుకుంటున్నారు. ఈ క్రమంలో రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి, తారకరత్నతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగభరిత నివాళి అర్పించారు. తారకరత్న ఆప్యాయత, వినయం, అంకితభావం ఎందరికో స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి స్పందిస్తూ, "తారకరత్న మనల్ని చాలా తొందరగా విడిచివెళ్లాడు. అతడు పంచిన ఆప్యాయత, అంకితభావంతో కూడిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. అతడి మరణ వార్త విని నేను తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురయ్యాను. అభిమానుల హృదయాల్లో అతడి మరణం మిగిల్చిన శూన్యం నాకు ఇప్పటికీ గుర్తుంది. తారకరత్నను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం" అని తెలిపారు.
తారకరత్నకు విజయసాయిరెడ్డి బంధువు అవుతారన్న సంగతి తెలిసిందే. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి విజయసాయిరెడ్డి పెదనాన్న అవుతారు.