Rahul Gandhi: దేశ భద్రతకు రాహుల్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి: కిరణ్ రిజిజు ఫైర్

Kiren Rijiju Demands Lifetime Ban on Rahul Gandhi
షార్ట్స్‌లో చూడండి

లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపించారు. దేశ భద్రతకు రాహుల్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని మండిపడ్డారు. దేశీయంగా, విదేశీ పర్యటనల్లో రాహుల్ నక్సలైట్లు, తీవ్రవాదులు, జార్జ్ సోరోస్ వంటి దేశ వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తులతో సమావేశాలు జరుపుతున్నారని ఆరోపించారు.


బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కూడా రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్ సభలో మోషన్ ప్రవేశపెట్టారు. జార్జ్ సోరోస్ వంటి దేశ వ్యతిరేక శక్తుల సాయంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై జీవితకాల నిషేధం విధించాలని కోరారు.

Go Back to Shorts
Rahul Gandhi
Kiren Rijiju
Nishikant Dubey
Congress
BJP
George Soros
Indian Politics
Lok Sabha
Disqualification
Election Ban

More Telugu News