Rajnath Singh: రఫెల్ ఫైటర్ జెట్ ఒప్పందం... దేశీయ పరికరాలపై రాజ్‌నాథ్ సింగ్ కీలక సూచన

రఫెల్ ఫైటర్ జెట్‌లలో 50 శాతం దేశీయ తయారీ పరికరాలు ఉండేలా చూసుకోవాలని ఫ్రాన్స్‌ను కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరారు. ఫ్రాన్స్‌తో రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకోనుంది. ఈ నేపథ్యంలో రఫెల్ పైటర్ విమానాలలో భారత తయారీ పరికరాలు ఉండాలని కోరారు.

ఇందులో భాగంగా ఆ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యంలో కో-డిజైన్, కో-డెవలప్‌మెంట్, కో-ప్రొడక్షన్ వంటి అంశాలు చేర్చినట్లు తెలుస్తోంది. రూ.3.25 లక్షల కోట్ల అంచనాతో 114 రఫెల్ యుద్ధ విమానాల సరఫరాకు ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో రక్షణ మంత్రుల స్థాయి వార్షిక సమావేశం బెంగళూరులో జరిగింది. భారత్‌లో తయారీ గురించి రాజ్ నాథ్ సింగ్ చర్చించారు. అలాగే మేకిన్ ఇండియా పరికరాలు ఉండడం గురించి, భారతీయ కంపెనీలకు సాంకేతికత బదిలీ వంటి అంశాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది.
Rajnath Singh
Rafale fighter jet
India France defense
Make in India
Defense deal
Indian defense industry

More Telugu News