Kolagani Srinivas: తెలంగాణలోని 7 కార్పొరేషన్‌లలో... మేయర్, డిప్యూటీ మేయర్‌లు వీరే

తెలంగాణలో ఏడు కార్పొరేషన్‌లలో మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాలను గెలుచుకోగా, బీజేపీ కరీంనగర్ మేయర్ పదవిని కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు సమానంగా సీట్లు రావడంతో రెండు పార్టీలు అవగాహన కుదుర్చుకున్నాయి. మొదటి రెండున్నరేళ్లు మేయర్ పదవి సీపీఐకి, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్‌కు ఇవ్వాలని నిర్ణయించాయి.

కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ సహకారంతో నిజామాబాద్ మేయర్ పదవిని దక్కించుకుంది. మొదటి నుంచి ఉత్కంఠ రేపిన కరీంనగర్ మేయర్ పదవి బీజేపీకి దక్కింది. కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు 22 స్థానాల చొప్పున గెలిచాయి. ఇక్కడ బీఆర్ఎస్ 8 సీట్లు గెలుచుకుంది. సీపీఐకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బేషరతుగా మద్దతు ప్రకటించినప్పటికీ, సీపీఐ మాత్రం రొటేషన్ పద్ధతిలో మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీతో నడిచేందుకు మొగ్గు చూపింది.

కార్పొరేషన్‌లలో మేయర్, డిప్యూటీ మేయర్‌లు వీరే

1. కరీంనగర్ కార్పొరేషన్ - మేయర్: కొలగాని శ్రీనివాస్ (బీజేపీ), డిప్యూటీ మేయర్: సునీల్ రావు (బీజేపీ).
2. నిజామాబాద్ కార్పొరేషన్ - మేయర్: ఉమారాణి (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్: సల్మా తహసీన్ (మజ్లిస్)
3. రామగుండం కార్పొరేషన్ - మేయర్: మహంకాళి స్వామి (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్: పాతిపెల్లి ఎల్లయ్య (కాంగ్రెస్)
4. కొత్తగూడెం కార్పొరేషన్ - మేయర్: మూడ్ గణేశ్ (సీపీఐ), డిప్యూటీ మేయర్: సిరిపురపు లలిత కుమారి (కాంగ్రెస్)
5. నల్గొండ కార్పొరేషన్ - మేయర్: బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్: మహమ్మద్ అష్రఫ్ అలీ అమర్
6. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ - మేయర్: గుమల్ మమత (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్: సురేందర్ రెడ్డి (కాంగ్రెస్),
7. మంచిర్యాల కార్పొరేషన్ - మేయర్: మధుకర్ (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్: రమ్య మహేశ్ (కాంగ్రెస్).
Kolagani Srinivas
Karimnagar Mayor
Telangana Municipal Elections
Nizamabad Mayor
Kothagudem CPI Congress Alliance

More Telugu News