Irfan Pathan: పాకిస్థాన్ ను చిత్తు చేసిన భారత్.. పాక్ ను ట్రోల్ చేసిన ఇర్ఫాన్ పఠాన్

టీ20 వరల్డ్ కప్ పాకిస్థాన్ ను టీమిండియా చిత్తు చేసింది. 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ ను ఓడించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్‌తో పాక్ బౌలర్ల బెంబేలెత్తించాడు. 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు. చివరికి 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేసి అదరగొట్టాడు.


మరోవైపు, పాకిస్థాన్ ఓటమిపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ఆఫ్ఘన్ జిలేబీ” పాటకు డాన్స్ చేస్తూ పాక్‌ను ట్రోల్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పాకిస్థాన్ పరువు తీసేశాడు ఇర్ఫాన్ భాయ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Irfan Pathan
India vs Pakistan
T20 World Cup
Ishan Kishan
Cricket
Afghanistan Jalebi
Cricket Match
India Win
Pakistan Loss
Viral Video

More Telugu News