పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ
- ఫిబ్రవరి 17 నుంచి జరగనున్న సీబీఎస్ఈ పరీక్షలకు హాజరు
- బీహార్‌లోని సమస్తిపూర్‌లో గల పొద్దార్ స్కూల్లో పరీక్షలకు హాజరు
- అందరి విద్యార్థుల్లాగే వైభవ్‌ను చూస్తామన్న పాఠశాల యాజమాన్యం
2026 ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ పదో తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యాడు. బీహార్‌లో ఫిబ్రవరి 17 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలు రాయనున్నాడు. అండర్-19 మ్యాచ్‌లో ప్రపంచ వేదికపై తన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ బ్యాట్స్‌మన్ ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు కానున్నాడు.
బీహార్‌లోని సమస్తిపూర్‌లోని పోద్దార్ అంతర్జాతీయ పాఠశాలలో వైభవ్ పరీక్షలకు హాజరవుతున్నాడు. వైభవ్ చదువుకుంటూనే మరోవైపు క్రికెట్‌లో రాణిస్తున్నాడు. పరీక్షల్లో వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా ఏమీ చూడమని, అందరు విద్యార్థుల్లాగే అతడిని చూస్తామని పాఠశాల అధికారులు తెలిపారు. వైభవ్ సూర్యవంశీ తన ఆట ద్వారా తామందరూ గర్వపడేలా చేశాడని, కానీ పరీక్షల విషయంలో మాత్రం ప్రోటోకాల్ మారదని స్పష్టం చేశారు. పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.