BSNL: 365 డేస్ రీచార్జ్ ప్లాన్ తీసుకువచ్చిన బీఎస్ఎన్ఎల్... వివరాలు ఇవిగో!
- మరో వార్షిక రీచార్జి ప్లాన్ను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్
- ఎక్కువ డేటా అవసరమయ్యే కస్టమర్ల కోసం రూ.2799 ప్లాన్
- రోజుకు 3 జీబీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చన్న బీఎస్ఎన్ఎల్
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్ను ప్రకటించింది. ఇటీవల రూ.2626 యాన్యువల్ ప్లాన్ను ప్రవేశపెట్టిన సంస్థ, ఇప్పుడు ఎక్కువ డేటా అవసరమయ్యే కస్టమర్ల కోసం రూ.2799 ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రూ.2799 వార్షిక ప్లాన్ వివరాల్లోకి వెళితే.. రోజుకు 3 జీబీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు. ఎక్కువ డేటా వినియోగించే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.
ఇక ‘దేశ్ కా నెట్వర్క్, దేశ్ కా భరోసా’ అంటూ ప్రచారం చేస్తున్న ఈ ప్లాన్ కోసం వినియోగదారులు రూ.2626తో రీఛార్జ్ చేసుకోవాలి. 365 రోజుల వరకు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.6 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అపరిమిత కాల్స్ యధావిధిగా లభిస్తాయి.
అయితే, ఈ ప్రత్యేక ఆఫర్ ఫిబ్రవరి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది.