Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల విజయం వేళ, ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ

Revanth Reddy Meets Priyanka Gandhi After Municipal Election Victory
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన వేళ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ భారీ విజయం సాధించడంపై వారి మధ్య చర్చ జరిగింది. అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రియాంక గాంధీ... రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కారణంగానే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి అన్నారు. 

కాంగ్రెస్ గెలుపుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పందించారు. రెండున్నరేళ్ల ప్రజాపాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ సంక్షేమ, అభివృద్ధి పాలనకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసం ఆదరణగా మారిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా శ్రమించారని ప్రశంసించారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana Municipal Elections
Priyanka Gandhi
Congress Party
Mallu Bhatti Vikramarka

More Telugu News