Vijayasai Reddy: 'వందేమాతరం' పూర్తి గీతాన్ని పంచుకున్న విజయసాయిరెడ్డి... కీలక వ్యాఖ్యలతో ట్వీట్!

Vijayasai Reddy Shares Complete Vande Mataram Song on Twitter
  • పూర్తి ‘వందేమాతరం’ పాడాల్సిందేనన్న విజయసాయిరెడ్డి
  • సగం గీతం పాడటం బానిసత్వమేనని వ్యాఖ్య
  • విదేశీ మతాల కోసం మన సంస్కృతిని వదులుకోవద్దని పిలుపు
  • పూర్తి గీతాన్ని ఆలపించాలన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించాలని సూచన
ఇప్పటివరకు మనం పాడుతున్న వందేమాతరం గీతం సగమేనని తెలుసా?... అయితే పూర్తి గీతం ఎలా ఉంటుందో రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో పంచుకున్నారు. వందేమాతరం’ పూర్తి గీతాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు పాడిన సగం గీతం బానిసత్వానికి నిదర్శనమని, ఈ దుస్థితిని మార్చి పూర్తి ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ సమర్థించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా విజయసాయి తన అభిప్రాయాన్ని వివరిస్తూ, "విదేశీ పాలకులు వెళ్లిపోయినా, విదేశీ మతాలు మన మధ్యే మిగిలిపోయాయి. అవి మన సంస్కృతిపై పరిపాలన చేయాలని చూస్తున్నాయి. భారతదేశంలో పుట్టిన మనకు మనసు ఉండదా? ఇప్పటికీ బానిసత్వపు సంకెళ్లేనా?" అని ప్రశ్నించారు.

గత 120 సంవత్సరాలుగా విదేశీ మతాల వారు ఏమనుకుంటారోనన్న భయంతోనే సగం ‘వందేమాతరం’ గీతాన్ని పాడామా..? అని ఆయన నిలదీశారు. "మన జాతీయ గేయంలో మన అమ్మవార్ల పేర్లు ఉండకూడదా?" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని మార్చి, పూర్తి ‘వందేమాతరం’ గీతాన్ని పాడాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని విజయసాయిరెడ్డి కోరారు.
Vijayasai Reddy
Vande Mataram
National Anthem
Indian Culture
Central Government
Patriotism
Indian History
Social Media
Rajya Sabha

More Telugu News