వాళ్లు మద్దతిస్తే బీజేపీ ఖాతాలో మరికొన్ని మున్సిపాలిటీలు.. భైంసాలో మజ్లిస్ గెలుపు
- ఆదిలాబాద్‌లో 49 వార్డులకు గాను 21 స్థానాలు గెలిచిన బీజేపీ
- నారాయణపేట, రాయికల్‌లో ముందంజలో బీజేపీ
- భైంసాలో 26 వార్డులకు 12 చోట్ల మజ్లిస్ విజయం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. 49 వార్డులకు గాను ఇప్పటివరకు బీజేపీ 21, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6 సీట్లు గెలుచుకున్నాయి. నిర్మల్‌లో కాంగ్రెస్‌కు 19, బీజేపీ 10, బీఆర్ఎస్ 1, రాయికల్‌లో బీజేపీ 5, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడు వార్డుల చొప్పున గెలిచాయి. మెట్‌పల్లిలోనూ బీజేపీ ముందంజలో ఉంది. కామారెడ్డిలో కాంగ్రెస్ 19, బీజేపీ 18, బీఆర్ఎస్ 10 వార్డులు దక్కించుకున్నాయి.
నారాయణపేటలో 24 వార్డులకు గాను బీజేపీ అత్యధిక స్థానాలు (11) గెలుచుకుంది. కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ మున్సిపాలిటీని దక్కించుకోవడం కోసం బీజేపీ స్వతంత్ర అభ్యర్థులతో చర్చలు జరుపుతోంది. ఆదిలాబాద్, నారాయణపేట, మెట్‌పల్లి మున్సిపాలిటీలను బీజేపీ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే స్వతంత్ర అభ్యర్థులు మద్దతిస్తేనే బీజేపీ ఈ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుంది.
నిర్మల్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీని మజ్లిస్ పార్టీ కైవసం చేసుకుంది. 26 వార్డులకు గాను మజ్లిస్ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి మజ్లిస్ పార్టీ ఛైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం ఉంది. నిర్మల్‌లో బీజేపీ ఆరు స్థానాలు దక్కించుకుంది.
కార్పొరేషన్ల విషయానికి వస్తే రామగుండం (38), మంచిర్యాల (44), నల్గొండ (27)లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా, కరీంనగర్ (13), నిజామాబాద్‌లలో బీజేపీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కొత్తగూడెం కార్పొరేషన్‌ను సీపీఐ (29) కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.