Ambati Rambabu: అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి... మీ తల్లిని అంటే ఒకటా?: బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana Slams Coalition Government Over Ambati Rambabu Arrest
షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారం వేడి పుట్టిస్తోంది. ఈ అంశంపై శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి... మీ తల్లిని అంటే ఒకటా? అని ఆయన ప్రశ్నించారు. మహిళల విషయంలో ఎవరు తప్పు చేసినా తప్పేనని అన్నారు. అంబటి రాంబాబు తల్లిని తిట్టిన వీడియోలు ఉన్నాయని తెలిపారు. 

అంబటిపై దాడి చేయడం వల్లే ఆయన ఘాటుగా స్పందించారని బొత్స అన్నారు. ఆయన విజ్ఞత కలిగిన వ్యక్తి కాబట్టే క్షమాపణ చెప్పారని తెలిపారు. అంబటిని వేధించిన వారంతా భవిష్యత్తుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడి చేయడం సరికాదని అన్నారు. మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై కూడా దాడి చేశారని విమర్శించారు. మహిళలను బయటకు తీసుకొచ్చి రాజకీయ మైలేజీ కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Go Back to Shorts
Ambati Rambabu
Botsa Satyanarayana
Andhra Pradesh Politics
YSRCP
TDP
Jogi Ramesh
AP Assembly
Political Arrest
Political Violence
Andhra Pradesh Government

More Telugu News