అప్పటివరకు నేను చాలా అందగత్తెనని అనుకున్నాను.. కానీ!: అనుష్క శర్మ
- ఆదిత్య చోప్రా వ్యాఖ్యలను గుర్తుచేసుకున్న అనుష్క శర్మ
- నువ్వు అందంగా లేవు, ప్రతిభతోనే రాణించాలని చెప్పిన డైరెక్టర్
- ఆఫీసులో మామూలుగానే ఉన్నా, కారులో ఏడ్చేసిన వైనం
- షూటింగ్‌లో తనను తాను చూసుకుని, ఆయన చెప్పింది నిజమేననిపించిందని వెల్లడి
- 'రబ్ నే బనా ది జోడీ'కి ముందు ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నానని ప్రస్తావన
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఒక కఠినమైన అనుభవాన్ని పంచుకున్నారు. తన తొలి చిత్రం 'రబ్ నే బనా ది జోడీ' సమయంలో నిర్మాత, దర్శకుడు ఆదిత్య చోప్రా తనతో అన్న మాటలు తనను ఎంతగా ప్రభావితం చేశాయో 'కాఫీ విత్ కరణ్' షోలో వెల్లడించారు.
ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ అనుష్క, "నేను ఆదిత్య చోప్రా ఆఫీసులో నాలుగో అంతస్తులో ఉన్నాను. ఆయన నాతో, 'వినండి, మీ ప్రతిభపై నాకు చాలా నమ్మకం ఉంది. మీరు మంచి నటి. కానీ మీరు చూడటానికి అంత అందంగా ఉండరు. అందుకే మీరు చాలా కష్టపడాలి. 'తానీ' పాత్రకు మిమ్మల్ని తీసుకుంటున్నాం' అని నిక్కచ్చిగా చెప్పారు" అని తెలిపారు.
ఆ మాటలు విన్న తర్వాత తన స్పందన గురించి వివరిస్తూ, "ఆఫీసు నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను చాలా మామూలుగానే ఉన్నాను. ఆయనకు 'థాంక్యూ' చెప్పి వచ్చేశాను. కానీ కారులో వెళ్తుండగా నాకే తెలియకుండా ఏడుపు వచ్చేసింది. కారు ఆపి మరీ ఏడ్చాను. ఆ సమయంలో మా అమ్మానాన్న ఊళ్లో లేరు. మా అమ్మకు ఫోన్ చేసి, 'ఇలా జరిగిందని నమ్మలేకపోతున్నాను' అని చెప్పాను" అని అనుష్క ఆనాటి బాధను పంచుకున్నారు.
ఆదిత్య చోప్రాను కలవక ముందు, తనను తాను చాలా అందగత్తెనని అనుకునేదాన్నని ఆమె అంగీకరించారు. "షూటింగ్ సమయంలో పెళ్లికూతురు దుస్తుల్లో నన్ను నేను మొదటిసారి మానిటర్‌పై చూసుకున్నప్పుడు, ఆయన చెప్పిందే నిజమనిపించింది. 'ఆయన చెప్పింది కరెక్టే. నేను అంత అందంగా లేను' అని అప్పుడు అర్థమైంది" అని అనుష్క వివరించారు. షారుఖ్ ఖాన్ సరసన ఈ అవకాశం రాకముందు తాను ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నానని కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.