Nandamuri Balakrishna: నాకు కొన్ని విషయాలు వినపడవు: బాలకృష్ణ ఫన్నీ కామెంట్స్

Nandamuri Balakrishna Funny Comments on Weight Loss in Assembly
  • అసెంబ్లీ లాబీలో బాలకృష్ణ, బొజ్జల, మంత్రి అనగాని మధ్య ఆసక్తికర చర్చ
  • బొజ్జల బరువు తగ్గడంపై మంత్రి అనగానిని అడిగిన బాలయ్య
  • ఇంకా తగ్గితే నాకు పోటీ వస్తావంటూ బొజ్జలకు సరదా హెచ్చరిక
  • బాలయ్య, లోకేశ్ ను ఒకే ఫ్రేమ్‌లో చూడాలన్న బొజ్జల సుధీర్ రెడ్డి
  • "నాకు కొన్ని వినపడవు" అంటూ బాలయ్య చమత్కారం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేతల మధ్య ఆసక్తికర సంభాషణలు, సరదా సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, మంత్రి అనగాని సత్యప్రసాద్ మధ్య బరువు తగ్గడంపై జరిగిన చర్చ నవ్వులు పూయించింది.

అసెంబ్లీ లాబీలో మంత్రి అనగానితో మాట్లాడుతున్న బాలకృష్ణ, అటుగా వచ్చిన బొజ్జల సుధీర్ రెడ్డిని చూపిస్తూ.. "బొజ్జల సుధీర్ రెడ్డి బరువు తగ్గానంటున్నాడు, మీకేమైనా తేడా కనిపిస్తుందా?" అని సరదాగా ప్రశ్నించారు. దీనికి బొజ్జల స్పందిస్తూ, "అన్నాయ్, ఇప్పటికే 15 కిలోలకు పైగా తగ్గాను, ఇంకా తగ్గమంటావా?" అని నవ్వుతూ సమాధానమిచ్చారు.

వెంటనే బాలకృష్ణ తనదైన శైలిలో.. "ఇంకా తగ్గకు, మళ్లీ నాకు పోటీ వస్తావ్" అంటూ ఛలోక్తి విసరడంతో అక్కడ నవ్వులు విరిశాయి. ఈ క్రమంలో బొజ్జల బదులిస్తూ.. "ప్రజలు మిమ్మల్ని, లోకేశ్ గారిని ఒకే ఫ్రేమ్‌లో చూడాలని అనుకుంటున్నారు" అని బాలకృష్ణతో అన్నారు. ఈ రాజకీయ ప్రస్తావనకు బాలకృష్ణ అంతే చమత్కారంగా.. "నాకు కొన్ని విషయాలు వినపడవు" అని బదులిచ్చి అక్కడి నుంచి ముందుకు సాగారు. 
Nandamuri Balakrishna
Balakrishna
Bojjala Sudheer Reddy
Anagani Satyaprasad
Andhra Pradesh Assembly
AP Assembly
Weight Loss
MLA
TDP
Nara Lokesh

More Telugu News