ఒక్క ఓటుతో వరించిన విజయం

  • కల్వకుర్తి మున్సిపాలిటీ పదో వార్డు ఫలితాలు
  • కాంగ్రెస్ అభ్యర్థికి 259, బీఆర్ఎస్ అభ్యర్థికి 258 ఓట్లు
  • పరకాలలోనూ ఒక్క ఓటుతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతను మార్చేసింది. రెండు చోట్ల ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థులను విజయం వరించింది. కల్వకుర్తి మున్సిపాలిటీలోని పదో వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య విజయం దోబూచులాడింది.

తొలుత కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్ కు రెండు ఓట్ల మెజారిటీ రాగా బీఆర్ఎస్ అభ్యర్థి తాహిర్ రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అధికారులు మరోసారి ఓట్లు లెక్కించగా.. ఎజాస్ కు 259 ఓట్లు, తాహిర్ కు 258 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

పరకాలలో..
పరకాల మున్సిపాలిటీలోని 17వ వార్డు ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్రకు 369 ఓట్లు పోలవగా.. బీఆర్ఎస్ అభ్యర్థి శనిగరపు రజినికి 368 ఓట్లు వచ్చాయి. దీంతో రజిని రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోగా రెండోసారి కౌంటింగ్ చేసినా ఫలితంలో మార్పులేదు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్ర గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.


More Telugu News