Dharmendra Pradhan: విద్యార్థులకు మూడవ తరగతి నుంచి అందుబాటులోకి 'ఏఐ': కేంద్రమంత్రి

Dharmendra Pradhan AI to be available for students from 3rd grade
షార్ట్స్‌లో చూడండి
కృత్రిమ మేధస్సు (ఏఐ) విధానాన్ని భారతదేశంలోని విద్యార్థులందరికీ చేరువ చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా విద్య సహా అన్ని రంగాల్లో ఏఐ విస్తరిస్తోందని అన్నారు. దేశంలో 30 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారని, 3వ తరగతి విద్యార్థుల నుంచి ఆధునాతన పరిశోధనలు నిర్వహించే విద్యార్థుల వరకు కృత్రిమ మేధను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.

ఢిల్లీలో జరిగిన ఏఐ-కాంక్లేవ్-2026 సదస్సులో పాల్గొన్న ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, కృత్రిమ మేధ రంగంలో భారత్ అభివృద్ధి చెందుతోందని అన్నారు. మన వద్ద మేధో సామర్థ్యానికి లోటు లేదన్నారు. కృత్రిమ మేధకు సంబంధించి పలు పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపారు. ఏఐకి సంబంధించిన పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను సృష్టించడంలో సాంకేతిక సంస్థలు నిమగ్నమయ్యాయని అన్నారు.
Go Back to Shorts
Dharmendra Pradhan
AI Conclave 2026
Artificial Intelligence
Indian Education
AI in Education

More Telugu News