తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్... ఎల్లుండి కౌంటింగ్
- రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు
- బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం
- ఈ నెల 13న ఓట్ల లెక్కింపు
తెలంగాణలో ఉత్కంఠ నడుమ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు నిరాటంకంగా కొనసాగింది. పలుచోట్ల ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సమయం ముగిసేసరికి క్యూలైన్లలో ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎన్నికల ప్రక్రియ చాలావరకు ప్రశాంతంగా ముగిసినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నగరంలోని 58వ డివిజన్‌లో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడగా, కొందరి చేతులు విరిగినట్లు సమాచారం. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌కు కూడా గాయాలయ్యాయి. దొంగ ఓట్లపై ఫిర్యాదు చేస్తే తమపైనే పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు జిల్లా పరిషత్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
ఇదే కరీంనగర్‌లోని 34వ డివిజన్, హుస్సేనీపుర ప్రాంతంలో దొంగ ఓట్ల వ్యవహారం కలకలం రేపింది. ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అక్రమంగా ఓట్లు వేస్తున్న ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకున్నారు. వారి వద్ద నకిలీ ఆధార్ కార్డులను గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ఎంఐఎం అభ్యర్థి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆ బూత్‌లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 2569 మున్సిపల్ వార్డులు, 412 కార్పొరేషన్ వార్డులకు ప్రజలు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అదే రోజు మధ్యాహ్నానికల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. అనంతరం, ఈ నెల 16న మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.