Dharmapuri Arvind: ఏసీపీతో వాగ్వాదానికి దిగిన ధర్మపురి అర్వింద్
- నిజామాబాద్ బూత్ నెంబర్ 7లో ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అర్వింద్
- కానిస్టేబుల్ తప్పు చేస్తే మీరు చేసినట్టేనని ఏసీపీతో అర్వింద్ వాగ్వాదం
- ప్రత్యర్థి పార్టీలు కుల ప్రస్తావన తీసుకురావడంపై ఆగ్రహం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. మరోవైపు పోలింగ్ సందర్భంగా నిజామాబాద్ లో ఓ సంఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ పరిధిలోని బూత్ నెంబర్ 7లో శంకర్ అనే కానిస్టేబుల్, మరో మున్సిపల్ ఉద్యోగి కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే సమాచారం తమకు అందిందంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అక్కడకు చేరుకున్నారు. వారి తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఏసీపీతో ఆయన వాగ్వాదానికి దిగారు. మీ కానిస్టేబుల్ తప్పు చేస్తే... మీరు చేసినట్టేనని అన్నారు.
మరోవైపు, వినాయక్ నగర్ డివిజన్ లో అర్వింద్ తో బీజేపీ కార్యకర్తలు మాట్లాడారు. ఓ డివిజన్ లో ప్రత్యర్థులు కుల ప్రస్తావన తెస్తున్నారని కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై అర్వింద్ స్పందిస్తూ... క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చేవారిని ఒక్కటే అడగాలని... కశ్మీర్ లో, బంగ్లాదేశ్ లో హిందువులను కులం అడిగి చంపారా? లేదా హిందువులు అని చంపారా? అని అడగాలని చెప్పారు.