'ఇదీ పుస్తకం ప్రస్తుత పరిస్థితి': రాహుల్ గాంధీ పుస్తక ప్రదర్శనపై స్పందించిన నరవణె
- 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదని పెంగ్విన్ పోస్టు
- దీనిని రీపోస్టు చేస్తూ 'నా పుస్తకం ప్రస్తుత పరిస్థితి ఇదీ' అన్న నరవణె
- రాహుల్ గాంధీ ట్వీట్‌పై స్పందించిన పెంగ్విన్ సంస్థ
తన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం ప్రచురణపై భారత సైన్యం మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె మౌనం వీడారు. తన పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. నా పుస్తక ప్రచురణ ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉందంటూ ఆయన 'ఎక్స్' వేదికగా 'పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా' చేసిన పోస్టును పేర్కొన్నారు.
ఈ పుస్తకం కాపీలు ఇంకా ప్రింట్ కాలేదని, డిజిటల్ రూపంలో కూడా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని, కాబట్టి ఈ కాపీలు ఎవరికీ ఇవ్వలేదని, విక్రయించలేదని ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా పోస్టు చేసింది. దీనిని ఆయన రీపోస్టు చేస్తూ పైవిధంగా స్పందించారు. ఈ పుస్తకం ఇంకా ప్రజలకు అందుబాటులోకి రాలేదని పెంగ్విన్ ప్రకటన చేసింది.
నరవణే రాసిన పుస్తకంపై పార్లమెంటులో దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. చైనా భారత భూభాగంలోకి వచ్చిందని ఈ పుస్తకం వెల్లడిస్తోందని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఆ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని అధికార బీజేపీ చెబుతోంది. ఇటీవల ఆయన ఈ పుస్తకంలోని కొన్ని పేజీలను కూడా సభలో ప్రదర్శించారు. ఈ క్రమంలో పెంగ్విన్ సంస్థ, నరవణే స్పందించారు. ఈ పుస్తకం ప్రచురణ కాలేదని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ పోస్టుపై పెంగ్విన్ స్పందన
తన పుస్తకం అందుబాటులో ఉందని 2023లో నరవణె చేసిన ట్వీట్‌ను రాహుల్ గాంధీ రీట్వీట్ చేస్తూ, ఈ పుస్తకాన్ని మార్కెట్‌లో విక్రయిస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పెంగ్విన్ స్పందించింది. ఆ పుస్తకం ఇంకా ప్రచురితమే కాలేదని, అది మార్కెట్‌లో అందుబాటులో లేదని స్పష్టం చేసింది. అధికారికంగా విడుదల చేసి, రిటైల్ వేదికల్లో విక్రయించడానికి సిద్ధంగా ఉన్న పుస్తకాలను ప్రచురితమైనవిగా పరిగణిస్తామని తెలిపింది.