IAS officers Telangana: తెలంగాణలో పలువురు సీనియర్ ఐఏఎస్‌ల బదిలీలు

తెలంగాణ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. తాజాగా విడుదలైన అధికారిక ఉత్తర్వుల ప్రకారం పలు ప్రధాన శాఖల్లో ఉన్నతాధికారుల మార్పులు చేపట్టింది. ఈ బదిలీలు రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులకు దారి తీసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

బదిలీ అయిన అధికారుల వివరాలు.. సింగరేణి సీఎండీగా డా. జ్యోతి బుద్ధప్రకాశ్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్‌ను నియమించారు. గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్ కొనసాగనున్నారు. టీజీఆర్ఏసీ డీజీగా సందీప్ కుమార్ సుల్తానియాను నియమించగా, పంచాయతీరాజ్ కమిషనర్‌గా దివ్య దేవరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. 

ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా కాత్యాయనీ దేవి నియమితులయ్యారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండీగా కాత్యాయనీ దేవికి అదనపు బాధ్యతలు కేటాయించారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ జాయింట్ ఎండీగా మయాంక్ మిట్టల్‌ను నియమించారు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ స్పెషల్ సీఎస్‌గా రఘురాం శర్మకు బాధ్యతలు అప్పగించారు. అలాగే, మంత్రి శ్రీధర్‌బాబు ఓఎస్డీగా అదనపు బాధ్యతల్లో రఘురాం శర్మ కొనసాగనున్నారు.
IAS officers Telangana
Telangana IAS transfers
Jyoti Buddha Prakash
Sabyasachi Ghosh
Sandeep Kumar Sultania
Divya Devarajan
Katyayani Devi
Mayank Mittal
Raghuram Sharma
Singareni CMD

More Telugu News