RK Selvamani: తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఆర్కే సెల్వమణి ఎన్నిక

RK Selvamani Elected as Tamil Directors Association President
  • దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి ఏకగ్రీవంగా ఎన్నిక
  • ఉపాధ్యక్షులుగా కేఎస్ రవికుమార్, పి. వాసు ఎన్నిక
  • ఇంతకు ముందు సంఘానికి సెక్రటరీగా ఉన్న సెల్వమణి
తమిళ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సీనియర్ దర్శకుడు ఆర్కే సెల్వమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెల్వమణి... మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా భర్త అనే విషయం తెలిసిందే. సంఘం ఉపాధ్యక్షులుగా కేఎస్ రవికుమార్, పి.వాసు, కార్యదర్శిగా ఆర్వీ ఉదయకుమార్, కోశాధికారిగా పేరరసు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ఐదు జాయింట్ సెక్రటరీ, 17 కార్యవర్గ సభ్యుల పదవులకు ఈనెల 15న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల అధికారిగా రిటైర్డ్ న్యాయమూర్తి తర్వీశ్ వ్యవహరించనున్నారు. ఈ ఎన్నికల్లో 1,800 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇంతకు ముందు ఆర్కే సెల్వమణి తమిళ దర్శకుల సంఘానికి సెక్రటరీగా పని చేశారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
RK Selvamani
Tamil Directors Association
Roja Selvamani
KS Ravikumar
P Vasu
RV Udayakumar
Tamil Cinema
Tamil Film Industry
Kollywood

More Telugu News