Chinta Mohan: చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను జగన్ ఖండించకపోవడం దురదృష్టకరం: చింతా మోహన్

Chinta Mohan Criticizes Jagan for Not Condemning Ambatis Remarks on Chandrababu
  • అంబటి వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానన్న చింతా మోహన్
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కార్పొరేషన్లను తిరిగి ప్రారంభించాలని డిమాండ్
  • ఎస్పీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్య
లోక్ సభ స్పీకర్ పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాలని అనుకోవడం విచారకరమని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న వారు ఒక జడ్జి మాదిరి ఉండాలని, అన్ని పక్షాలను కలుపుకుని ముందుకు వెళ్లాలని చెప్పారు. 

గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో నిందితుడు రాజ్ కేసిరెడ్డిని ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల గురించి చింతా మోహన్ స్పందిస్తూ... రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్ర దుస్థితిని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని మోహన్ అన్నారు. అంబటి వ్యాఖ్యలను జగన్ ఖండించకపోవడం దురదృష్టకరమని చెప్పారు. 

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు జగన్ ప్రభుత్వం అందించిన సౌకర్యాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని చింతా మోహన్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కార్పొరేషన్లను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని... 2029లో ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యార్థులకు రావాల్సిన అన్నింటికి సంబంధించి ముఖ్యమంత్రితో తాను సంతకం చేయిస్తానని తెలిపారు.
Chinta Mohan
Ambati Rambabu
Chandrababu Naidu
Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
SC ST OBC Students
Liquor Scam
Supreme Court
AP Congress
Andhra Pradesh

More Telugu News