కోర్టులో పిన్నెల్లి బ్రదర్స్‌కు లభించని ఊరట
- జంట హత్యల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి సోదరులు
- జ్యుడీషియల్ రిమాండ్ లో వున్న నిందితులు
- బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన గురజాల కోర్టు న్యాయమూర్తి
ఈ కేసులో పిన్నెల్లి వెంకటరెడ్డి గతేడాది డిసెంబర్ 1న, రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి డిసెంబర్ 11న మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు. అప్పటి నుంచి వీరు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై నిన్న గురజాలలోని 10వ అదనపు జిల్లా న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. వాదనల అనంతరం న్యాయాధికారి జి.ప్రియదర్శిని బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.