ఇళయరాజా బయోపిక్‌పై వదంతులు ..స్పందించిన ధనుష్ టీమ్

  • ఇళయరాజా బయోపిక్ నుంచి దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్‌ తప్పుకున్నారంటూ రూమర్స్
  • ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్న ధనుష్ టీమ్ 
  • డీసీ సినిమా పూర్తవ్వగానే అరుణ్ .. ఇళయరాజా బయోపిక్ షూటింగ్ ను పునః ప్రారంభిస్తారని వెల్లడి
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌ నుంచి దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌ తప్పుకున్నారని, ఈ క్రమంలో  ఆయన స్థానంలో మరొకరు ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారంటూ సోషల్ మీడియాలో రూమర్స్‌ వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారంపై ధనుష్ టీమ్ స్పందించి స్పష్టత ఇచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం అరుణ్ తెరకెక్కిస్తున్న ‘డీసీ’ సినిమా పూర్తవ్వగానే, ఆయన మళ్లీ ఇళయరాజా బయోపిక్‌ షూటింగ్‌ను పునఃప్రారంభిస్తారని ధనుష్ టీమ్ వెల్లడించింది. 

ధనుష్ ప్రధాన పాత్రలో ఇప్పటికే ఈ బయోపిక్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అనంతరం దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ అరుణ్ ‘డీసీ’ సినిమాను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే అరుణ్ ఇక ఇళయరాజా బయోపిక్‌కు దర్శకత్వం వహించట్లేదంటూ పుకార్లు షికారు చేశాయి. ధనుష్ - అరుణ్ కాంబినేషన్‌లో గతంలో ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా విడుదలైంది. ఇక ధనుష్ ప్రస్తుతం ‘డీ 55’ (వర్కింగ్ టైటిల్), ‘కర’ మూవీల్లో నటిస్తున్నారు.


More Telugu News