ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం.. ఓటుకు నోటు సాక్ష్యాలు కాల్చేశారన్న కేటీఆర్

  • ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేటీఆర్
  • ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని వ్యాఖ్య
  • ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని ఆగ్రహం
నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓటుకు నోటు సాక్ష్యాలను కాల్చివేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనకు బుద్ధి చెప్పాలని అన్నారు. ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. సింగరేణిని గందరగోళపరచాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కదానిని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పథకాలు తీసుకున్న వారు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పొరపాటు చేశారని అన్నారు. మరోసారి భస్మాసుర హస్తం వంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని సూచించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. 12 ఏళ్లలో బీజేపీ రూపాయి ఇవ్వలేదన్నారు.


More Telugu News