Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్
సినీ నటుడు విజయ్ దేవరకొండ పెళ్లికి తనకు ఆహ్వానం అందలేదని ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ వెల్లడించారు. తన కొత్త సినిమా 'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన సందడి చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు విజయ్ దేవరకొండ పెళ్లి అంశాన్ని ప్రస్తావించారు.
ఈ నెల 26న విజయ్, రష్మికలు వివాహం చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో, త్వరలో విజయ్ దేవరకొండ వివాహమని తెలిసింది, మీరు వెళుతున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ ఆహ్వానిస్తే మీకు కూడా వాట్సాప్లో పంపిస్తానని, అప్పుడు కలిసి వెళదామని తరుణ్ భాస్కర్ సమాధానమిచ్చారు. విజయ్, తరుణ్ భాస్కర్ మంచి స్నేహితులు. తరుణ్ దర్శకత్వంలో, విజయ్ హీరోగా 2016లో వచ్చిన 'పెళ్లిచూపులు' చిత్రం ఘన విజయం సాధించింది.