Jeffrey Epstein: ఎప్‌స్టీన్ 'బేబీ రాంచ్‌' ప్లాన్.. తన వీర్యంతో కొత్త జాతిని సృష్టించేందుకు ప్రణాళిక!

Jeffrey Epstein Planned Baby Ranch for New Race
షార్ట్స్‌లో చూడండి
లైంగిక నేరారోపణలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించి మరో విస్తుపోయే విషయం వెలుగుచూసింది. తన డీఎన్‌ఏతో మానవ జాతిని విస్తరింపజేయాలనే విపరీత ఆలోచనతో ఆయన ఒక 'బేబీ రాంచ్‌'ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. న్యూయార్క్ టైమ్స్ 2019లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, ఈ భయంకరమైన ప్రణాళిక వివరాలు బయటపడ్డాయి.

ఎప్‌స్టీన్ తన న్యూ మెక్సికోలోని 'జోరో రాంచ్‌'లో ఒకేసారి 20 మంది మహిళలను తన వీర్యంతో గర్భవతులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తద్వారా తన డీఎన్‌ఏతో ఒక ఉన్నతమైన జాతిని (సూపర్ రేస్) సృష్టించవచ్చని భావించాడు. టెక్నాలజీ ద్వారా మానవ సామర్థ్యాలను మెరుగుపరచవచ్చని నమ్మే 'ట్రాన్స్‌హ్యూమనిజం', నియంత్రిత ప్రజననం ద్వారా మెరుగైన మానవ జనాభాను సృష్టించాలనే 'యూజెనిక్స్' సిద్ధాంతాల పట్ల ఎప్‌స్టీన్‌కు ఉన్న ఆసక్తే ఈ విపరీత ఆలోచనలకు కారణమని తెలుస్తోంది.

2000వ దశకం నుంచే ఎప్‌స్టీన్ ఈ ప్రణాళిక గురించి పలువురు శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలతో చర్చించినట్లు సమాచారం. తన తల, పురుషాంగాన్ని భవిష్యత్తు కోసం శీతలీకరించి (క్రయోజెనిక్ ఫ్రీజింగ్) భద్రపరచాలని కూడా ఆయన కోరుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి.

అయితే, ఎప్‌స్టీన్ ఈ 'బేబీ రాంచ్‌' ప్రణాళిక గురించి తరచూ మాట్లాడినప్పటికీ, దానిని ఆచరణలో పెట్టినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ ఆరోపణలు ఆయన లైంగిక నేరాలతో పాటు, ఆయన వికృత మనస్తత్వాన్ని, ప్రమాదకరమైన ఆలోచనా విధానాన్ని ప్రపంచానికి తెలియజేశాయి.
Go Back to Shorts
Jeffrey Epstein
Epstein baby ranch
Jeffrey Epstein allegations
Zorro Ranch
Epstein DNA
Transhumanism
Eugenics
Epstein crimes
New Mexico
Super race

More Telugu News