రాహుల్ గాంధీకి సిక్కు మతంపై ద్వేషం ఉందన్న ప్రధాని మోదీ... తీవ్రంగా స్పందించిన ఖర్గే
- ప్రధాని వ్యాఖ్యలు ఖండించిన మల్లికార్జున ఖర్గే
- ప్రధాని ప్రసంగంలో పనికొచ్చే అంశం ఒక్కటీ లేదని విమర్శలు
- సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణన
మోదీ 97 నిమిషాల పాటు ప్రసంగించారని కానీ ఏమాత్రం ఉపయోగం లేని ప్రసంగం అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం విషయంలో తాము చేసిన ప్రతిపాదనల్లో ఒక్క దానికి కూడా ఆయన స్పందించలేదని అన్నారు. ఆయన కేవలం 100 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అంటూ ఏదేదో మాట్లాడారని ఎద్దేవా చేశారు.
ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన పుస్తకాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించగానే అధికార పార్టీ ఇబ్బంది పడిందని అన్నారు. సభలో అధికార పక్షం తమకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదని అన్నారు. లోక్ సభ, రాజ్యసభ ప్రజాస్వామ్యానికి రెండు స్థంభాలని, ఒక దానిలో ప్రతిపక్షాన్ని అణిచివేసి మరో సభలో మాట్లాడితే ఫలితం లేదని ఖర్గే అన్నారు.