Pakistan Cricket: పాక్ జెర్సీపై ఐఎస్ఐ లోగో.. టీ20 వరల్డ్ కప్ లో మరో వివాదం

Pakistan Cricket Jersey Controversy ISI Logo at T20 World Cup
షార్ట్స్‌లో చూడండి
టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ జట్టు వివాదం రేపిన విషయం తెలిసిందే. ఓవైపు దీనిపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ఆటగాళ్ల కోసం పాక్ సిద్ధం చేసిన జెర్సీపై మరో వివాదం రేగింది. టీ20 వరల్డ్ కప్ కోసం సిద్ధం చేసిన పాకిస్థాన్ జెర్సీపై అటవీ మేక ‘మార్ఖోర్’ బొమ్మ కనిపించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆకుపచ్చ రంగులో ఉన్న జెర్సీపై మధ్యలో నల్లటి రంగులో మార్ఖోర్ చిత్రాన్ని ప్రింట్ చేశారు. పాకిస్థాన్ జాతీయ జంతువు మార్ఖోర్.. అదే విధంగా ఇదే చిహ్నాన్ని ఆ దేశ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కూడా ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్ ఆటగాళ్ల కోసం రెడీ చేసిన జెర్సీపై మార్ఖోర్ బొమ్మ కనిపించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద అటవీ మేక
హిమాలయ ప్రాంతాలు, కారకోరంలోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మార్ఖోర్ కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అటవీ మేకగా గుర్తింపు పొందింది. జమ్మూకశ్మీర్, ఆఫ్ఘనిస్థాన్ లలోనూ కొన్నిచోట్ల ఈ మేక కనిపిస్తుంది. ఈ మేకను పాకిస్థాన్ తమ జాతీయ జంతువుగా గుర్తించింది.
Go Back to Shorts
Pakistan Cricket
T20 World Cup
Markhor
ISI
Pakistan Jersey
India Pakistan Match
Cricket Controversy
National Animal

More Telugu News